logo

శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన ఈ-కార్లు

ఫార్ములా-ఈ ఛాంపియన్‌షిప్‌ కార్లు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాయి. రియాద్‌ నుంచి బోయింగ్‌ 747-400 ఛార్టెడ్‌ విమానం ద్వారా 90 టన్నుల బరువైన రేసింగ్‌ కార్ల విడిభాగాలు బుధవారం రాత్రి 11.50గంటలకు విమానాశ్రయం కార్గో టెర్మినల్‌కు చేరుకున్నాయి.

Published : 03 Feb 2023 01:42 IST

కార్లను తీసుకొచ్చిన కార్గో విమానం

ఈనాడు, హైదరాబాద్‌: ఫార్ములా-ఈ ఛాంపియన్‌షిప్‌ కార్లు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాయి. రియాద్‌ నుంచి బోయింగ్‌ 747-400 ఛార్టెడ్‌ విమానం ద్వారా 90 టన్నుల బరువైన రేసింగ్‌ కార్ల విడిభాగాలు బుధవారం రాత్రి 11.50గంటలకు విమానాశ్రయం కార్గో టెర్మినల్‌కు చేరుకున్నాయి. మరో రెండు విమానాలలో మిగతా రేసింగ్‌ కార్ల భాగాలు చేరుకోనున్నాయని విమానాశ్రయం సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ గురువారం తెలిపారు. కార్ల విడిభాగాలను 83 పెట్టెల్లో తీసుకురాగా... వాటిని కిందికి దించేందుకు ప్రత్యేకంగా కార్గో హ్యాండ్లింగ్‌ పరికరాలను ఉపయోగించామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు