logo

సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తా..

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా సి. నారాయణరెడ్డి గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పదవీ బాధ్యతలను స్వీకరించారు.

Published : 03 Feb 2023 01:42 IST

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న సి.నారాయణరెడ్డి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా సి. నారాయణరెడ్డి గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పదవీ బాధ్యతలను స్వీకరించారు. అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్‌, ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. 2015 బ్యాచ్‌కు చెందిన ఆయన నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ కలెక్టర్‌గా నిఖిలకు పనిచేశారు.  ఈ సందర్భంగా నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యలను చేపట్టానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరుస్తానన్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటానని తెలిపారు.

సన్మానాలు, పుష్పగుచ్ఛాలు..

కలెక్టర్‌ నారాయణరెడ్డిని జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు కలిసి శాలువాలతో సత్కరించారు. పుష్పగుచ్ఛాలను అందజేశారు. డీఆర్‌డీఓ కృష్ణన్‌, సంక్షేమ శాఖాధికారులు మల్లేశం, కోటాజి, బాబుమోజెస్‌, సుధారాణి, రాజేశం, వినయ్‌కుమార్‌, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, ఆర్డీవో విజయకుమారి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పల్వన్‌కుమార్‌, జిల్లా పరిశ్రమల అధికారి వినయ్‌కుమార్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాంబాబు, జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షుడు విజయకుమార్‌ తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.

జిల్లా న్యాయమూర్తితో భేటీ

కలెక్టర్‌గా నారాయణరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్పెషల్‌ డిస్ట్రిక్‌, సెషన్స్‌ జడ్జి కె. సుదర్శన్‌ను మర్యాద పూర్వకంగా కార్యాలయానికి వెళ్లి కలిశారు. ఆయనకు పూల మొక్కను అందజేశారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి శీతల్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంత్‌లతో పాటు అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని