logo

‘రాజీ’యే మార్గం..వివరించండి

ఈ నెల 11న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక కేసులు రాజీ చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌ తెలిపారు.

Published : 03 Feb 2023 01:42 IST

సమన్వయ సమావేశంలో న్యాయవాదులు, పోలీసులు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: ఈ నెల 11న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక కేసులు రాజీ చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌ తెలిపారు. గురువారం న్యాయస్థాన ఆవరణలో పోలీసులు, న్యాయవాదులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నచిన్న తప్పులు, పొరపాట్లతో న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ నష్టపోతున్నామని భావించే వారు తమ తప్పులను బేషరతుగా అంగీకరిస్తే.. చిన్నపాటి జరిమానా విధించి వారిపై ఉన్న కేసును కొట్టివేస్తారన్నారు. పోలీస్‌ ఠాణాల వారీగా రాజీ పడదగిన కేసులను పోలీసులు గుర్తించి ఇరువర్గాలకు అవగాహన కల్పించి రాజీ పడేలా ప్రోత్సహించాలన్నారు. న్యాయవాదులు కూడా తమ క్లయింట్లు కేసులు రాజీ పడే విధంగా కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శీతల్‌, జూనియర్‌ న్యాయమూర్తి శ్రీకాంత్‌, వికారాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు, ఎస్‌ఐలు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని