logo

రివాల్వర్‌తో సంచారం

భూవివాదంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు  రివాల్వర్‌తో దిగిన తన చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో ఉంచాడు. అది వైరల్‌ కావడంతో.. పోలీసులు ఆ వ్యక్తిని ఠాణాకు పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Published : 03 Feb 2023 01:42 IST

సామాజిక మాధ్యమంలో చిత్రం హల్‌చల్‌
పోలీసుల కౌన్సెలింగ్‌

దోమ: భూవివాదంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు  రివాల్వర్‌తో దిగిన తన చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో ఉంచాడు. అది వైరల్‌ కావడంతో.. పోలీసులు ఆ వ్యక్తిని ఠాణాకు పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దోమ ఠాణా పరిధిలో జరిగిన ఘటన వివరాలు.. ఎస్‌ఐ విశ్వజన్‌ కథనం ప్రకారం.. దోమ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి భూ వివాదంలో నిందితుడు. కొన్ని రోజుల కిందట బెయిలుపై విడుదలయ్యాడు. పక్క మండలంలో ఉన్న న్యాయవాదికి చెందిన అనుమతి ఉన్న రివాల్వర్‌తో ఫొటో దిగి ఓ సామాజిక మాధ్యమ గ్రూపులో పోస్టు చేశాడు. విషయం తెలిసిన పోలీసులు ఠాణాకు పిలిచారు. రివాల్వర్‌ ఎలా పొందాడు?గ్రూపులో ఎందుకు పోస్టు చేశాడు? తదితర వివరాలపై విచారించి, కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని