logo

లోపాలు వద్దు.. అప్రమత్తత మరవద్దు

శాసనసభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఎలాంటి లోపాలు లేకుండా చూడడం అత్యంత ప్రాధాన్య అంశమని హైదరాబాద్‌ కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు.

Published : 03 Feb 2023 01:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఎలాంటి లోపాలు లేకుండా చూడడం అత్యంత ప్రాధాన్య అంశమని హైదరాబాద్‌ కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. సమావేశాల సందర్భంగా ముఖ్యమైన కూడళ్లు, లేన్ల దగ్గర తగిన సిబ్బందిని నియమించి, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఇదే నెలలో వరుసగా జరుగనున్న ఫార్ములా ఈ-రేస్‌, నూతన సచివాలయ ప్రారంభోత్సవం, శివరాత్రి, శివాజీ జయంతి తదితర పండుగల నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్‌ ఏర్పాట్లపై నగర పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లతో కమిషనర్‌ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సాధారణ ప్రజలు, ప్రముఖుల రాకపోకలకు ఇబ్బందిలేని విధంగా ట్రాఫిక్‌ మళ్లింపు ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఫార్ములా ఈ-రేస్‌ నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపులపై అధికారులు డిజిటల్‌, ఇతర రూపాల్లో ప్రచారం నిర్వహించాలని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రకటనలపై దృష్టిపెట్టాలని సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ విక్రమ్‌సింగ్‌ మాన్‌, ఇతర అధికారులున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని