logo

1850 సిటీ బస్సులకు వీటీఎస్‌

సిటీ బస్సులు ఎక్కడున్నాయో.. ఎప్పుడొస్తాయో తెలిసేలా టీఎస్‌ఆర్టీసీ వీటీఎస్‌ (వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌)ను అమర్చే పనిలో నిమగ్నమైంది.

Published : 03 Feb 2023 01:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: సిటీ బస్సులు ఎక్కడున్నాయో.. ఎప్పుడొస్తాయో తెలిసేలా టీఎస్‌ఆర్టీసీ వీటీఎస్‌ (వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌)ను అమర్చే పనిలో నిమగ్నమైంది. ముందుగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లకు అమర్చినట్టు గ్రేటర్‌జోన్‌ ఈడీ యాదగిరి చెప్పారు. ఇలా 1850 బస్సులకు అమర్చి ప్రధాన కార్యాలయంతో అనుసంధానించినట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ నడుస్తోంది. ఇలా మరో నెలరోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నారు. వాస్తవానికి దూరప్రాంతాలకు, విమానాశ్రయానికి వెళ్లే బస్సుల్లో ఇప్పటికే ఈ సిస్టమ్‌ పని చేస్తోంది. అయితే సిటీ బస్సులకు యాప్‌లో స్వల్ప మార్పులు చేయాలా.. వద్దా.. అని ఆలోచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని