logo

విద్యార్థులను పరీక్షలకు అనుమతించండి: హైకోర్టు

శంకర్‌పల్లి ఇక్ఫాయ్‌ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ కేసును ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని గురువారం హైకోర్టు వర్సిటీకి సూచించింది.

Published : 03 Feb 2023 01:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: శంకర్‌పల్లి ఇక్ఫాయ్‌ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ కేసును ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని గురువారం హైకోర్టు వర్సిటీకి సూచించింది. శంకరపల్లి ఠాణాలో గతేడాది నవంబరులో నమోదైన కేసులో పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేసేదాకా సస్పెండ్‌ చేయడాన్ని సవాలు చేస్తూ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన సింగిల్‌ జడ్జి కమిటీ విచారణను సత్వరం పూర్తి చేసి నిర్ణయాన్ని తీసుకోవాలని తీర్పు వెలువరించారు. శుక్రవారం నుంచి జరగనున్న ఇంటర్నల్‌ పరీక్షలకు అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విద్యార్థినిపై దాడి జరిగిన సమయంలో పిటిషనర్లు సమీపంలో ఉన్నారని, ఇందులో పాల్గొనలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు