logo

బ్రాహ్మణులకు ఉపనయనాల కిట్లు ఇవ్వాలి

బ్రాహ్మణ బాలురకు ఉపనయనాలకు సంబంధించిన కిట్లను అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ బ్రాహ్మణ ప్రతినిధుల ఫోరం విజ్ఞప్తి చేసింది.

Published : 03 Feb 2023 01:42 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: బ్రాహ్మణ బాలురకు ఉపనయనాలకు సంబంధించిన కిట్లను అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ బ్రాహ్మణ ప్రతినిధుల ఫోరం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలోని 250 బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో 2700 మంది బ్రాహ్మణ బాలురుకు ఉపనయనాలను నిర్వహిస్తున్నారని తెలిపింది. గురువారం కాచిగూడలో జరిగిన సమావేశంలో బ్రాహ్మణ ప్రతినిధుల ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ గిరిప్రసాద్‌శర్మ, సభ్యులు చింతపల్లి మంగపతిరావు, జీఎల్‌ నరసింహారావు, దర్శనం శర్మ మాట్లాడారు. 85 వస్తువులతో కూడిన ఒక్కో ఉపనయనం కిట్‌ను ఇవ్వడం బ్రాహ్మణ సంఘాలకు ఆర్థికంగా భారంగా మారుతుందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని