logo

బిస్కెట్ల కంపెనీల్లో పనికి తీసుకొస్తున్న 27 మంది బాలుర గుర్తింపు

నగరంలోని పలు కంపెనీల్లో పనిచేసేందుకు తీసుకొస్తున్న 27 మంది బాలురను ఆర్పీఎఫ్‌ పోలీసులు రక్షించారు. సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

Published : 03 Feb 2023 01:42 IST

ఛైల్డ్‌ లైన్‌ సంస్థకు అప్పగించిన ఆర్పీఎఫ్‌ పోలీసులు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: నగరంలోని పలు కంపెనీల్లో పనిచేసేందుకు తీసుకొస్తున్న 27 మంది బాలురను ఆర్పీఎఫ్‌ పోలీసులు రక్షించారు. సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో బల్లార్షా నుంచి కాజీపేటకు వచ్చిన సమయంలో రైలులో 27 మంది 14, 15ఏళ్ల వయసులోపు బాలలున్నట్లు, వారిని ఆధార్‌ కార్డులో పుట్టినతేదీ మార్చి తీసుకువస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ద.మ రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ సెక్యూరిటీ కమిషనర్‌ దేబాస్మిత బెనర్జీ ఆదేశాలతో రైలు కాజీపేటకు చేరుకున్నాక ఆపరేషన్‌ యాక్షన్‌ అగైనెస్ట్‌ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ (ఏఏహెచ్‌టి) కింద ఆర్పీఎఫ్‌ పోలీసులు, బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ ఎన్‌జీవో ప్రతినిధులతో కలిసి తనిఖీలు చేపట్టారు. రైల్లో ఉన్న 27 మంది బాలురతోపాటు వారిని తీసుకొస్తున్న ఏజెంట్లు ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రాగానే ఆర్పీఎఫ్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. బాలల వివరాలను నమోదు చేసుకున్నారు. ఆ బాలలను బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్‌లోని బిస్కెట్ల కంపెనీల్లో పనుల్లో చేర్పించేందుకు తీసుకొస్తున్నట్లు తెలుసుకున్నారు. బాలలను ఛైల్డ్‌లైన్‌ సంస్థకు అప్పగించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ అనంతరం అప్పగిస్తారని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని