logo

సీడీఆర్‌వో కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి

చత్తీస్‌గఢ్‌ భద్రతా దళాలు సీడీఆర్‌వో(ది కోఆర్డినేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్స్‌) కార్యకర్తల్ని నిర్బంధించి వేధించడం దారుణమని మానవ హక్కుల వేదిక ఏపీ, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు వీఎస్‌ కృష్ణ, ఎస్‌.జీవన్‌కుమార్‌ విమర్శించారు.

Published : 03 Feb 2023 01:42 IST

ఈనాడు- హైదరాబాద్‌: చత్తీస్‌గఢ్‌ భద్రతా దళాలు సీడీఆర్‌వో(ది కోఆర్డినేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్స్‌) కార్యకర్తల్ని నిర్బంధించి వేధించడం దారుణమని మానవ హక్కుల వేదిక ఏపీ, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు వీఎస్‌ కృష్ణ, ఎస్‌.జీవన్‌కుమార్‌ విమర్శించారు. వారిని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బస్తర్‌లో వాస్తవాలను వెలికితీయాలనే చట్టబద్ధమైన హక్కును అడ్డుకోవడం ఇకనైనా మానుకోవాలని ఓ ప్రకటనలో కోరారు. ‘‘దక్షిణ బస్తర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, భద్రతా దళాల బాంబు దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో వాస్తవాలను పరిశీలించేందుకు నిజనిర్ధారణ కమిటీ అక్కడ చేరుకుంది. తెలంగాణ, ఏపీ, పశ్చిమబంగ, చత్తీస్‌గఢ్‌, దిల్లీకి చెందిన 25 మంది కార్యకర్తల్ని నిర్బంధించి సుకుమా జిల్లా దడటోటాలో ఉంచారు.. అక్కడి వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు’’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని