TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా?: 6న హైకోర్టు తీర్పు

ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా? అనే అంశంపై హైకోర్టు ధర్మాసనం ఈనెల 6న తీర్పు వెల్లడించనుంది. 

Published : 03 Feb 2023 21:14 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా? అనే అంశంపై హైకోర్టు ధర్మాసనం ఈనెల 6న తీర్పు వెల్లడించనుంది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయాలని గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి తీర్పునిచ్చారు. సిట్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కూడా హైకోర్టు రద్దు చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాం ధర్మాసనం అప్పీలుపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెల్లడించనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని