logo

అత్యంత కచ్చితత్వంతో వర్షపాతం అంచనా

అత్యంత కచ్చితత్వంతో వర్షపాతాన్ని ముందుగా గుర్తించడమనేది పర్యావరణ పరిశోధనల్లో అత్యంత సవాలుతో కూడుకున్నది.

Published : 04 Feb 2023 03:19 IST

ఐఐటీహెచ్‌లోని రెయిన్‌డ్రాప్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీ పరికరం

ఈనాడు, సంగారెడ్డి: అత్యంత కచ్చితత్వంతో వర్షపాతాన్ని ముందుగా గుర్తించడమనేది పర్యావరణ పరిశోధనల్లో అత్యంత సవాలుతో కూడుకున్నది. వర్షపాతానికి సంబంధించి సహజ వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మైక్రోఫిజికల్‌ ప్రక్రియలపై ప్రాథమిక పరిజ్ఞానం లేకపోవడంతో సమస్య వస్తోంది. ఈ పరిస్థితుల్లో కచ్చితత్వంతో వర్షపాతాన్ని అంచనా వేసేలా ఐఐటీ హైదరాబాద్‌ ముందడుగు వేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన రెయిన్‌డ్రాప్‌ రీసెర్చి(వాన బిందువుల పరిశోధన) ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌ మూర్తి, ఆచార్యుడు విద్యాసాగర్‌లతో కలిసి నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే సారస్వత్‌ శుక్రవారం దీన్ని ఆవిష్కరించారు.  కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆచార్య కీర్తి సాహు ఈ అంశమై పరిశోధనలు చేసి ఈ ఫెసిలిటీని సృష్టించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని