logo

శంకరనారాయణ రచనలు మనసుకు ఉల్లాసాన్నిస్తాయి

హాస్య అవధాని శంకరనారాయణ దేశ విదేశాల్లో ఎన్నో అవధానాలు చేసి హాస్యబ్రహ్మగా పేరు పొందారని తెలంగాణ పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ కొనియాడారు.

Published : 04 Feb 2023 03:19 IST

గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న  శ్రీలక్ష్మి, దామోదర్‌, శంకరనారాయణ, జనార్దనమూర్తి తదితరులు

రాంనగర్‌ ,  న్యూస్‌టుడే: హాస్య అవధాని శంకరనారాయణ దేశ విదేశాల్లో ఎన్నో అవధానాలు చేసి హాస్యబ్రహ్మగా పేరు పొందారని తెలంగాణ పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ కొనియాడారు. శంకరనారాయణ పాత్రికేయుడిగా, కవిగా, కళాకారుడిగా రాణించటం విశేషమన్నారు. శంకరనారాయణ రచించిన ‘విదేశాల్లో హాస్యావధానం’ గ్రంథాన్ని శుక్రవారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో ఆయన ఆవిష్కరించారు. త్యాగరాయ గానసభ కమిటీ సభ్యుడు సగంకర నారాయణ మాట్లాడుతూ శంకరనారాయణ రచనలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు.  గాయని లయన్‌ శ్రీమణి, గ్రంథ రచయిత డా.శంకరనారాయణ మాట్లాడారు. కార్యక్రమానికి కళా జనార్దనమూర్తి అధ్యక్షత వహించగా ప్రముఖ న్యాయవాది, గాయని తోట శ్రీలక్ష్మి, సెన్సార్‌ బోర్డు సభ్యుడు తిరువాని చంద్రశేఖర్‌, పాటల రచయిత విశ్వేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని