logo

క్రమశిక్షణతో కూడిన జీవనం సాగించాలి: చిన జీయర్‌ స్వామి

ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని సాగిస్తేనే సమాజం బాగుంటుందని  త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి పేర్కొన్నారు.

Published : 04 Feb 2023 03:19 IST

సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తున్న వేద పండితులు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని సాగిస్తేనే సమాజం బాగుంటుందని  త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న సమతా కుంభ్‌-2023 ఉత్సవాలు శుక్రవారం రెండో రోజు వైభవంగా జరిగాయి. ఉదయం 7.30 గంటలకు దివ్వసాకేతం నుంచి సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులను సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలోకి పల్లకిలో వేద పండితులు తీసుకొచ్చారు. చిన జీయర్‌ స్వామి గరుడ పట ఆరాధన, ధ్వజారోహణం చేశారు. భక్తులనుద్దేశించి ప్రవచించారు. నాలుగు ద్వారాలతో నిర్మించిన యాగశాలలో వేద పండితులు అగ్ని ప్రతిష్ఠ, వేదశాంతి, నిత్య పూర్ణాహుతి చేశారు. సాయంత్రం 5 నుంచి విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం జరిగింది. యాగశాలలో ఆరాధనలు, భేరీతాడనం, దేవతాహ్వానం, రాత్రి 8 గంటలకు సాకేత రామచంద్ర స్వామికి చంద్రప్రభ వాహన సేవ, దివ్య దేశాధీశులకు 18 గరుడ సేవలు నిర్వహించారు. రాత్రి 8.30 హారతి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా శనివారం మధ్యాహ్నం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్‌ వైద్య శిబిరం సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని చిన జీయర్‌ స్వామి పిలుపునిచ్చారు.

నేటి కార్యక్రమాలు.. * సమతా కుంభ్‌-2023 ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం ఉదయం సమతామూర్తి స్ఫూర్తి ప్రదాతకు కృతజ్ఞతాంజలి కీర్తన  * ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రామానుజ నూత్తందాది సామూహిక పారాయణం. * మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్‌ వైద్య శిబిరం. * సాయంత్రం 5 నుంచి 5.45 వరకు వేదికపై ఎదుర్కోలు. * సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 వరకు సాకేత రామచంద్ర స్వామికి శేష వాహన సేవ, సాకేతవల్లీ అమ్మవారికి హంస వాహన సేవ, 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు. * రాత్రి 8.30 గంటలకు హారతి, శాత్తుమురై, ప్రసాద గోష్ఠి నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని