logo

త్రిభాష నిఘంటువులు రావాలి

దేశంలోనే గిరిజన భాష, జీవన విధానం ప్రత్యేకశైలితో కూడినదని, భాష వర్గీకరణ, మౌఖిక సాధనం ద్వారా కథలు, సామెతలు, అనుభవాలను తెలుసుకొని భాష వ్యాకరణ సూత్రాలను క్రోడీకరించి త్రిభాష నిఘంటువులను తయారు చేయాలని భాషావేత్తలకు ఆచార్య బి.రామకృష్ణారెడ్డి సూచించారు.

Published : 04 Feb 2023 03:19 IST

రామకృష్ణారెడ్డిని సత్కరించిన ఆచార్య తంగెడ కిషన్‌రావు, ఆచార్య రెడ్డి శ్యామల

నారాయణగూడ, న్యూస్‌టుడే: దేశంలోనే గిరిజన భాష, జీవన విధానం ప్రత్యేకశైలితో కూడినదని, భాష వర్గీకరణ, మౌఖిక సాధనం ద్వారా కథలు, సామెతలు, అనుభవాలను తెలుసుకొని భాష వ్యాకరణ సూత్రాలను క్రోడీకరించి త్రిభాష నిఘంటువులను తయారు చేయాలని భాషావేత్తలకు ఆచార్య బి.రామకృష్ణారెడ్డి సూచించారు. ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా వర్సిటీ అభివృద్ధి పీఠం పక్షాన ఎన్టీఆర్‌ కళామందిరంలో శుక్రవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథి వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ.. రామకృష్ణారెడ్డికి ‘పద్మశ్రీ’పురస్కారం వరించడంతో గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను భారత ప్రభుత్వం గుర్తించినట్లుగా భావిస్తున్నానని అన్నారు. భాషాభివృద్ధి పీఠం అధిపతి ఆచార్య రెడ్డి శ్యామల అధ్యక్షోపన్యాసం చేయగా భాషాశాస్త్రవేత్తలు డా.ఉషాదేవి, డా.ఆశీర్వాదం, డా.రామాంజనేయులు ఇతరులు రామకృష్ణారెడ్డిని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని