ఠాణా.. వసతుల ఖజానా
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లిలో నిర్మించిన పోలీస్‌స్టేషన్ నూతన భవనానికి ఆధునిక సదుపాయాలు సమకూర్చారు. ఎత్తైన కొండను తొలిచి.. దాదాపు రూ.4 కోట్ల విరాళాలతో దీనిని నిర్మించారు.
బాచుపల్లిలో రూ.4 కోట్ల విరాళాలతో నిర్మాణం
నిజాంపేట, న్యూస్‌టుడే
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లిలో నిర్మించిన పోలీస్‌స్టేషన్ నూతన భవనానికి ఆధునిక సదుపాయాలు సమకూర్చారు. ఎత్తైన కొండను తొలిచి.. దాదాపు రూ.4 కోట్ల విరాళాలతో దీనిని నిర్మించారు. అందులో అధునాతన సదుపాయాలు కల్పించారు. త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు.
సీఎస్‌ఆర్ (కామన్ సోషల్ రెస్పాన్సిబులిటీ) పథకం కింద భవన నిర్మాణ ఖర్చును అరబిందో ఫార్మా కంపెనీ భరించింది. మిగతా వసతులు సమకూర్చేందుకు దాతలు ముందుకొచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మహిళలు, పురుష సిబ్బందికి వసతి, ప్రత్యేక స్టోర్‌రూం ఏర్పాటుచేశారు. 300 మందికి సరిపోయే భోజనశాల ఏర్పాటుచేశారు. భవిష్యత్తులో సేవల్ని విస్తరించినా రెండు దశాబ్దాలకు సరిపోయేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆరుగురు ఎస్సైలు పనిచేస్తుండగా.. మరో 10 మందికి పైగా విధులు నిర్వర్తించవచ్చు. భవనం ఎదుట అశోక చక్రం, నాలుగు సింహాలతో 28 అడుగుల నల్లటి ఏకశిల స్తూపాన్ని కాంచీపురంలో ప్రత్యేకంగా తయారుచేయించారు. ‘‘రాష్ట్రంలోనే అత్యధిక సదుపాయాలు, ఆధునికంగా నిర్మించిన ఈ ఠాణాను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తార’’ని బాచుపల్లి సీఐ కె.నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
* పోలీస్‌స్టేషన్‌కు ప్రభుత్వం కేటాయించిన స్థలం : 1.31 ఎకరాలు
* స్టేషన్ విస్తీర్ణం: 2,100 చదరపు అడుగులు. మూడు అంతస్తులు
* మొదటి అంతస్తు: అధికారులు, ప్రజలకు అనుసంధానమైన సేవలు
* నిర్మాణం ప్రారంభం : 10.04.2021
* రెండు..: అధికార కార్యకలాపాలకు సంబంధించిన మల్టీపర్పస్ కాన్ఫరెన్స్‌హాల్, నేర, కంప్యూటర్ వంటి ఇతర విభాగాలతోపాటు సీసీ టీవీలకు ఆఫ్టికల్ ఫైబర్ సాయంతో 1,400 కెమెరాలను అనుసంధానం చేశారు. మరో 4 వేల కెమెరాలను కూడా అనుసంధానం చేసే సౌకర్యముంది. వీటిని జూబ్లీహిల్స్‌లోని రాష్ట్ర కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయనున్నారు.
* మరిన్ని వసతులు: లిఫ్టు, వికలాంగులకు ర్యాంపు, ట్రైసైకిళ్లు, 4 ఆర్వో ప్లాంట్లు, 2 సూట్ రూంలు, గ్రానైట్‌బెంచీలు, పిల్లలకు క్రీడా పరికరాలు, వాటర్ ఫౌంటెన్, వ్యూపాయింట్, గెజిబ్ (సేదతీరే ప్రదేశం), బాలీథిమ్, పార్కింగ్, పరేడ్ గ్రౌండ్, వర్షపునీరు వృథాపోకుండా భారీ ఇంకుడు గుంత.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: ‘అప్పీల్ చేసుకునే స్థితిలోనే..’: రాహుల్ అనర్హతపై జర్మనీ స్పందన
-
Temples News
తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: మద్యం మత్తులో భార్య, కుమార్తె హత్య
-
Ap-top-news News
AP Govt: మార్చి నెల జీతాలు ఎప్పుడొస్తాయో?
-
Crime News
Duranto Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్..