logo

ఓబీసీల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం దేశంలోని 70 కోట్ల మంది ఓబీసీల సంక్షేమాన్ని విస్మరించిందని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అన్నారు.

Published : 04 Feb 2023 03:17 IST

ఐక్యత చాటుతున్న ఆర్‌.కృష్ణయ్య, బీసీ నేతలు

కాచిగూడ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం దేశంలోని 70 కోట్ల మంది ఓబీసీల సంక్షేమాన్ని విస్మరించిందని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అన్నారు. కేంద్రం అవలంబిస్తున్న బీసీల వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ ఈ నెల 8, 9 తేదీల్లో పార్లమెంట్‌ వద్ద నిర్వహించనున్న భారీ ప్రదర్శన సన్నాహక సమావేశం శుక్రవారం కాచిగూడలోని హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఇందులో ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు జబ్జల శ్రీనివాస్‌, నేతలు సూర్యనారాయణ, నీలం వెంకటేశ్‌, గుజ్జ సత్యం, కోల జనార్దన్‌, భూపేశ్‌సాగర్‌, రాజ్‌కుమార్‌, సుధాకర్‌, నందగోపాల్‌, వేముల రామకృష్ణ, కృష్ణ, శివమ్మ, రామ్‌దేవ్‌, కల్యాణి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని