logo

మృతుడికీ పదోన్నతి!

రెండేళ్ల క్రితం చనిపోయిన సబ్‌ ఇంజినీర్‌కు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) పదోన్నతి కట్టబెట్టిన వైనమిది.

Published : 04 Feb 2023 01:43 IST

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఏఏఈ ప్రమోషన్లలో విచిత్రం 

ఈనాడు, హైదరాబాద్‌: రెండేళ్ల క్రితం చనిపోయిన సబ్‌ ఇంజినీర్‌కు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) పదోన్నతి కట్టబెట్టిన వైనమిది. సంస్థ పరిధిలో గురువారం 57 మంది సబ్‌ ఇంజినీర్లకు అడిషనల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఏఈ), అసిస్టెంట్‌ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించింది. వీరిలో ఏఏఈ పదోన్నతులు పొందిన వారు 49 మంది ఉన్నారు. వరస క్రమంలో 44వ స్థానంలో ఉన్న సబ్‌ ఇంజినీర్‌ పి.మల్లయ్యకు ఏఏఈ ప్రమోషన్‌ ఇచ్చి మెట్రోజోన్‌ నుంచి వికారాబాద్‌ సర్కిల్‌కు బదిలీ చేసినట్లుగా ఉత్తర్వులు ఇచ్చారు. మల్లయ్య హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ విధులు నిర్వహించేవారని రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారని మెట్రో జోన్‌ ఉద్యోగులు అంటున్నారు. కారుణ్య నియామకాల కింద మల్లయ్య కూతురుకు సైబర్‌ సిటీ సర్కిల్‌లో చాలాకాలం క్రితమే సబ్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం కూడా డిస్కం కల్పించింది. అయినా రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడంతో కార్పొరేట్‌ కార్యాలయంలో హెచ్‌ఆర్‌ విభాగం విమర్శలు ఎదుర్కొంటోంది. నేరుగా పదోన్నతుల జాబితాను విడుదల చేయడం.. అందులో మృతుడికి పదోన్నతి దక్కడంతో తోటి సబ్‌ ఇంజినీర్లే అవాక్కవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని