logo

ఆ బాధ్యతలు మాకొద్దు

అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి బల్దియా ఇంజినీరింగ్‌ విభాగంలో తీసుకుంటున్న చర్యలతో అధికారుల్లో అసంతృప్తి పెంచుతోంది.

Published : 04 Feb 2023 01:38 IST

ఏఈల పనులూ మేము చేయాలా? డీఈఈల అసంతృప్తి

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి బల్దియా ఇంజినీరింగ్‌ విభాగంలో తీసుకుంటున్న చర్యలతో అధికారుల్లో అసంతృప్తి పెంచుతోంది. ఏఈల బదిలీలతో ఖాళీ అయిన చోట్ల తమను ఇన్‌ఛార్జిలుగా నియమించడాన్ని డీఈఈలు తప్పుపడుతున్నారు. అవసరమైతే సుదీర్ఘ సెలవులపై వెళతామని సంకేతాలు పంపుతున్నారు.

పనులు ఆగకూడదని... క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడకూడదనే ఉద్దేశంతో సర్కిల్‌ స్థాయిలో ఈఈ, డీఈఈలకు ఏఈలు లేనిచోట్ల అదనపు బాధ్యతలు కట్టబెడుతున్నారు. ఇదే సమస్యగా మారుతోంది. అసిస్టెంట్‌ ఇంజినీర్లుగా ఏళ్ల తరబడి సేవలు అందించి డీఈఈలుగా పదోన్నతి పొందిన తమకు.. మళ్లీ ఏఈల బాధ్యతలను తాత్కాలికంగా అయినా కట్టబెట్టడం ఏమిటని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు అంటున్నారు. వార్డుల వారీగా బాధ్యతల వల్ల కార్పొరేటర్లు చులకనగా చూస్తున్నారని ఒక డీఈఈ వాపోయారు. సికింద్రాబాద్‌ జోనల్‌ పరిధిలో ఓ డీఈఈ తీవ్రస్థాయిలో ఈఈ ముందు తన అసంతృప్తి వెళ్లగక్కారు. ‘ఇలాగైతే దీర్ఘకాలిక సెలవు పెట్టుకొని వెళతా.. నాకు ఆ అదనపు బాధ్యతలు వద్దు సార్‌... నేను చేయలేను.’ అంటూ ఖరాఖండీగా చెప్పేశారు. దీంతో ఈ విషయాన్ని ఇంజినీరింగ్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ)కి తెలపాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు