logo

కంటోన్మెంట్‌ విలీనంపై సంప్రదింపులు: కేంద్ర మంత్రి

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని పౌర నివాస ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేసినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌ పేర్కొన్నారు.

Published : 04 Feb 2023 01:33 IST

ఈనాడు, దిల్లీ: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని పౌర నివాస ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేసినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌ పేర్కొన్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. నిర్ణయం తీసుకునేముందు భాగస్వాములరందరితో(స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు) సంప్రదిస్తామని మంత్రి వెల్లడించారు.

* వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో ఆయుష్‌ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రాయోజిత పథకం కింద రూ.6 కోట్లు ఇచ్చేందుకు ఆయుష్‌ శాఖ 2016-17లోనే ఆమోదించిందని ఆ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ తెలిపారు. ఎంపీలు రంజిత్‌రెడ్డి, ఎం.కవిత, వెంకటేష్‌ అడిగినప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని