logo

శిక్షలు పడినప్పుడే నేరాలకు అడ్డుకట్ట

నేరస్థులకు శిక్షలు పడినప్పుడే నేరాలకు అడ్డుకట్ట వేయగలమని ట్రూత్‌ల్యాబ్స్‌ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ డాక్టర్‌ గాంధీ స్పష్టం చేశారు.

Published : 04 Feb 2023 01:31 IST

ట్రూత్‌ ల్యాబ్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కేపీసీ గాంధీ

ఈనాడు, హైదరాబాద్‌: నేరస్థులకు శిక్షలు పడినప్పుడే నేరాలకు అడ్డుకట్ట వేయగలమని ట్రూత్‌ల్యాబ్స్‌ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ డాక్టర్‌ గాంధీ స్పష్టం చేశారు. సరైన సాక్ష్యాధారాలు సేకరించి న్యాయస్థానాల ఎదుట ఉంచినప్పుడు  ఇది సాధ్యమవుతుందన్నారు. శిక్షల నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతోనే కొందరు వ్యక్తులు తిరిగి నేరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్‌లో నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ కృష్ణదేవరావు, ట్రూత్‌ల్యాబ్స్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌తో కలిసి డాక్టర్‌ కేపీసీ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. నల్సార్‌- ట్రూత్‌ల్యాబ్స్‌ ఆధ్వర్యంలో ‘ఎఫెక్టివ్‌ యుటిలైజేషన్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌’పై శనివారం జాతీయస్థాయి సెమినార్‌ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని