logo

రూ.150 కోట్ల విలువైన సర్కారు స్థలానికి విముక్తి

శంషాబాద్‌ విమానాశ్రయం కాలనీకి అతి సమీపంలో కబ్జాకు గురైన రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎట్టకేలకు విముక్తి కలిగింది.

Published : 04 Feb 2023 03:17 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ విమానాశ్రయం కాలనీకి అతి సమీపంలో కబ్జాకు గురైన రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎట్టకేలకు విముక్తి కలిగింది. గత నెల 12న ‘అధికారుల ఉదాసీనం.. కోట్ల భూమి పరాధీనం’ శీర్షికతో  ‘ఈనాడు’లో వెలువడిన కథనానికి  ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఎయిర్‌పోర్ట్‌కు ఆనుకొని ఉన్న భూములను హెచ్‌ఎండీఏకు (340 ఎకరాలు) అటవీ శాఖ(176 ఎకరాలు)లకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ భూములను రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, అటవీ శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సమగ్ర సర్వే చేశారు. కబ్జాకు గురైన దాదాపు 10 ఎకరాల భూమి అటవీ శాఖకు చెందినదిగా సర్వేలో తేలడంతో రియల్‌ వ్యాపారులు నిర్మించిన ప్రహరీ నిర్మాణాలను శుక్రవారం కూల్చివేసినట్లు  శంషాబాద్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని