logo

మహిళను అసభ్యంగా చూపించే ధోరణి వద్దు

సినిమాలు, ప్రసార మాధ్యమాల్లో మహిళలను అసభ్యంగా చూపించాలనే ధోరణి మారాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఆకాంక్షించారు.  

Published : 04 Feb 2023 03:17 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: సినిమాలు, ప్రసార మాధ్యమాల్లో మహిళలను అసభ్యంగా చూపించాలనే ధోరణి మారాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఆకాంక్షించారు.  ఇంటర్నేషనల్‌ అడ్వర్టైజింగ్‌ అసోసియేషన్‌ (ఐఏఏ) భారత విభాగం రాయదుర్గం టీ హబ్‌లో శుక్రవారం ‘ప్రసార మాధ్యమాల్లో, ప్రకటనల్లో లింగ చైతన్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘‘సినిమాల్లో మహిళను అసభ్యంగా చూపిస్తున్నారని, అదేమని అడిగితే అభిమానులు అలా కోరుతున్నారని చెప్పే ధోరణి మారాలి. పురుషులకు సంబంధించిన ఉత్పత్తుల వ్యాపార ప్రకటనల్లోనూ మహిళలను అసభ్యంగా చూపిస్తున్నారు. భారత్‌లో వనితలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారు చేయలేనిదంటూ లేదు.  మహిళలు బొద్దుగా ఉంటే ద్వేషించేలా, జీరో సైజ్‌ అంటూ చెబుతూ ప్రచారాల కోసం చిత్రీకరించడం సరికాదు. మహిళలను తక్కువ చేసి చూపించే ప్రకటనలు, సినిమాలను వనితలే బహిష్కరించాలి’’ అని పిలుపునిచ్చారు. ఏఐఐ అధ్యక్షుడు అవినాశ్‌ పాండే, ఛైర్మన్‌ శ్రీనివాసన్‌, అభిషేక్‌, డా.శారద, నందిని రెడ్డి, డా.ప్రణతి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని