logo

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో డిజిటల్‌ క్లాక్‌రూమ్‌ లాకర్‌ ప్రారంభం

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని పదో నంబరు ప్లాట్‌ఫాం సమీపంలో ఏర్పాటుచేసిన డిజిటల్‌ క్లాక్‌రూమ్‌ లాకర్‌ను రైల్వే ఏసీఎం రవికాంత్‌ శుక్రవారం ప్రారంభించారు.

Published : 04 Feb 2023 03:17 IST

రెజిమెంటల్‌బజార్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని పదో నంబరు ప్లాట్‌ఫాం సమీపంలో ఏర్పాటుచేసిన డిజిటల్‌ క్లాక్‌రూమ్‌ లాకర్‌ను రైల్వే ఏసీఎం రవికాంత్‌ శుక్రవారం ప్రారంభించారు. ప్రయాణికులు తమ విలువైన వస్తువులను భద్రపర్చుకునేందుకు ఆధునిక సాంకేతికతతో దీన్ని ఏర్పాటుచేశారని ఆయన తెలిపారు. జీబోమో ఏరోటాక్స్‌ సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఈ లాకర్‌ను.. సెల్‌ఫోన్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ నంబర్‌ ఆధారంగా ప్రతిఒక్కరూ ఉపయోగించుకోవచ్చన్నారు. ఇందులోని చిన్న లాకర్‌కు రూ.20, పెద్ద లాకర్‌కు రూ.30 చొప్పున రోజువారీగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత రోజు నుంచి గంటకు రూ.5 చొప్పన ఛార్జీలు విధిస్తారని చెప్పారు. త్వరలో అన్ని రైల్వేస్టేషన్లలోనూ ఇలాంటి డిజిటల్‌ క్లాక్‌రూమ్‌ లాకర్‌లను ఏర్పాటు చేస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని