logo

అనంతగిరికి ఆయుష్‌ ఆస్పత్రి మంజూరు

అనంతగిరిలో ఆయుష్‌ ఆసుపత్రి ఏర్పాటుకు అడుగు ముందుకు పడింది. ఇంటిగ్రేటెడ్‌ 50 పడకల దవాఖానా మంజూరైందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు.

Published : 04 Feb 2023 03:17 IST

తొలివిడత రూ.6కోట్ల విడుదలకు అంగీకారం

ఎంపీ రంజిత్‌రెడ్డి

వికారాబాద్‌, న్యూస్‌టుడే: అనంతగిరిలో ఆయుష్‌ ఆసుపత్రి ఏర్పాటుకు అడుగు ముందుకు పడింది. ఇంటిగ్రేటెడ్‌ 50 పడకల దవాఖానా మంజూరైందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి సర్భానందసోనోవాల్‌ బదులిచ్చారని, జాతీయ ఆయుష్‌ మిషన్‌(నామ్‌) కింద ఏర్పాటు చేయనున్నామని చెప్పారన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆయుష్‌శాఖ కలిసి రూ.7.57 కోట్లు మంజూరు చేయగా, తొలివిడత రూ.6 కోట్లు విడుదల చేయడానికి అంగీకారం కుదిరిందని చెప్పారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించారన్నారు. 2016-17లోనే అనంతగిరిలో ఆయుష్‌ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని చెప్పారు. ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గడువు విధించలేదని, నామ్‌ నిబంధనల ప్రకారం డయోగ్నోసిస్‌, పరికరాలు, ఔషధాలు తదితర సామగ్రి ఉండాలని కేంద్ర మంత్రి చెప్పారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని