logo

ప్రకృతిలో ప్రతి ప్రాణిని ప్రేమించాలి

ప్రకృతిలో సాఫీగా జీవనం సాగిస్తున్న ప్రాణులన్నింటిని  ప్రేమించడం సామాజిక బాధ్యతగా భావించాలని శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి పేర్కొన్నారు.

Published : 05 Feb 2023 03:47 IST

ధ్యానం చేస్తున్నచిన జీయర్‌ స్వామి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ప్రకృతిలో సాఫీగా జీవనం సాగిస్తున్న ప్రాణులన్నింటిని  ప్రేమించడం సామాజిక బాధ్యతగా భావించాలని శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో శనివారం మూడో రోజు సమతా కుంభ్‌-2023 వేడుకలు వైభవంగా జరిగాయి.  సాయంత్రం సాకేత రామచంద్ర స్వామికి ఎదుర్కోలు, శేషవాహన సేవలు జరిగాయి. అనంతరం చినజీయర్‌ మాట్లాడుతూ ప్రంపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా మహిళలకు వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు.

నేటి కార్యక్రమం.. ఆదివారం సాయంత్రం 5 గంటలకు  108 దివ్యదేశాలకు వేదికపై శాంతి కల్యాణం నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని