logo

Hyderabad: ఫోర్జరీ కేసులో నటుడు అరెస్టు

ఫోర్జరీ సంతకాలతో మోసం చేసిన ఓ నటుడిపై నగర సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అట్లూరి నవీన్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డి, ఎం.శ్రీధర్‌రెడ్డి, పి.నవీన్‌కుమార్‌ డైరెక్టర్లుగా గతేడాది ఎన్‌ స్వ్కేర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ స్థిరాస్తి సంస్థను ప్రారంభించారు.

Updated : 05 Feb 2023 10:01 IST

నవీన్‌కుమార్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఫోర్జరీ సంతకాలతో మోసం చేసిన ఓ నటుడిపై నగర సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అట్లూరి నవీన్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డి, ఎం.శ్రీధర్‌రెడ్డి, పి.నవీన్‌కుమార్‌ డైరెక్టర్లుగా గతేడాది ఎన్‌ స్వ్కేర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ స్థిరాస్తి సంస్థను ప్రారంభించారు. సంస్థ కొనుగోలు చేసిన పలు స్థలాలను సూర్యాపేట జిల్లాకు చెందిన అట్లూరి నవీన్‌రెడ్డి ఒక్కడే ఫోర్జరీ సంతకాలతో విక్రయించినట్టు మిగిలిన భాగస్వాములు గుర్తించారు. రూ.55 కోట్ల మేర తాము నష్టపోయినట్టు అంచనాకు వచ్చారు. ఈ సొమ్ముతో అతను హీరోగా సినిమా ప్రారంభించినట్టు తెలుసుకొని బాధితులు శ్రీధర్‌రెడ్డి, నవీన్‌ గత నెల 2న నగర సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా నవీన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు