logo

నా కుమారుడి ఆచూకీ చెప్పండి..

తన కుమారుడి ఆచూకీ చెప్పాలంటూ సీఎం కేసీఆర్‌ అన్న కుమార్తె రమ్యారావు శనివారం రాష్ట్ర డీజీపీ కార్యాయానికి వచ్చారు. డీజీపీ అంజనీ కుమార్‌ను కలవడానికి పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 05 Feb 2023 03:25 IST

డీజీపీ కార్యాలయానికి  వచ్చిన రమ్యారావు

నారాయణగూడ, జూబ్లీహిల్స్‌: తన కుమారుడి ఆచూకీ చెప్పాలంటూ సీఎం కేసీఆర్‌ అన్న కుమార్తె రమ్యారావు శనివారం రాష్ట్ర డీజీపీ కార్యాయానికి వచ్చారు. డీజీపీ అంజనీ కుమార్‌ను కలవడానికి పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత అనుమతించడంతో అదనపు డీజీపీ సంజయ్‌కుమార్‌ జైన్‌ను కలిసి మాట్లాడారు. శుక్రవారం అర్ధరాత్రి తమ ఇంటికి వచ్చిన పోలీసులు.. తన కుమారుడు ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు రితేష్‌రావును అరెస్టు చేశారన్నారు. ఎక్కడ ఉన్నాడో చెప్పడం లేదన్నారు.

అదుపులోకి తీసుకోలేదు... పోలీసు అర్హత పరీక్షల ఫలితాలపై ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌యూఐ నేత రితేష్‌రావును ముందుస్తుగా అదుపులోకి తీసుకొనేందుకు గురువారం రాత్రి ఫిలింనగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లామని, ఇంట్లో ఉన్న ఆయన తల్లి రమ్యారావు.. రితేష్‌ లేడని చెప్పడంతో పరిసరాల్లో పరిశీలించి వెనుతిరిగామని బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. రితేష్‌ రావును తాము అదుపులోకి తీసుకోలేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు