logo

‘కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావడానికే మోదీని విమర్శిస్తున్నారు’

కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావడం కోసం ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని దీనికి చరమగీతం పాడే రోజు త్వరలోనే వస్తుందన్నారు.

Published : 05 Feb 2023 03:47 IST

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కార్ఖానా, న్యూస్‌టుడే: కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావడం కోసం ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని దీనికి చరమగీతం పాడే రోజు త్వరలోనే వస్తుందన్నారు. కంటోన్మెంట్‌లోని లీ ప్యాలెస్‌లో శనివారం భాజపా మహంకాళి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో పూర్తి స్థాయిలో రెండు పడక గదుల నిర్మాణాలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నగరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. డ్రైనేజీ, నీటి వ్యవస్థ సక్రమంగా లేదన్నారు. గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఆయా అంశాల్లో ప్రజలను చైతన్యం చేస్తూనే పార్టీని అభివృద్ధి చేయడానికి భాజపా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కిషన్‌రెడ్డి పిలపునిచ్చారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాల సమన్వయం, ముద్ర లోన్‌లు, ఈశ్రామ్‌ కార్డులు ఇప్పించాలన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్‌కు ధన్యవాద తీర్మానం, జిల్లా సమస్యలపై రాజకీయ తీర్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మర్రి శశిదర్‌రెడ్డి, కంటోన్మెంట్‌ బోర్డు నామినేటెడ్‌ సభ్యుడు రామకృష్ణ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని