logo

రోజూ బ్యాడ్మింటన్‌ ఆడుతా.. అదే నా ఆరోగ్య రహస్యం

నా వయసు 74 ఏళ్లు.. రోజు ఉదయం మా ఇంట్లో డ్రైవర్‌, వంటమనిషి, వ్యక్తిగత సహాయకుడితో కలిసి గంట సేపు బ్యాడ్మింటన్‌ ఆడటం అలవాటు.

Updated : 05 Feb 2023 04:52 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

క్యాన్సర్‌ జయించిన వారిని సన్మానిస్తున్న వెంకయ్యనాయుడు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: నా వయసు 74 ఏళ్లు.. రోజు ఉదయం మా ఇంట్లో డ్రైవర్‌, వంటమనిషి, వ్యక్తిగత సహాయకుడితో కలిసి గంట సేపు బ్యాడ్మింటన్‌ ఆడటం అలవాటు. ఇదే నా ఆరోగ్య రహస్యం.. అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మెరుగైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు, నడక, యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యవంత జీవనం సాగించవచ్చని పేర్కొన్నారు. శనివారం మాదాపూర్‌లోని మెడికవర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. క్యాన్సర్‌ను జయించిన పలువురిని వెంకయ్యనాయుడు సన్మానించి జ్ఞాపికలను అందజేసి మాట్లాడారు. భారత్‌లో మరణాలకు కారణమవుతున్న టాప్‌ టెన్‌ వ్యాధుల్లో క్యాన్సర్‌ ఒకటన్నారు. దీని చికిత్సలో సకాలంలో గుర్తించడం, మెరుగైన వైద్యం అందించడం ఎంతో కీలకమన్నారు.  ఖరీదైన క్యాన్సర్‌ చికిత్స పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. మెడికవర్‌ హాస్పిటల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌కృష్ణ మాట్లాడుతూ.. క్యాన్సర్‌ చికిత్సలో సరికొత్త విధానాలు, అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని