logo

ఆరేళ్ల తర్వాత బాల్యవివాహాలు గుర్తుకు వచ్చాయా?: ఎంపీ అసదుద్దీన్‌

అస్సాంలో ఆరేళ్ల నుంచి అధికారంలో కొనసాగుతున్న భాజపా సర్కారుకు బాల్యవివాహాల అంశం ప్రస్తుతం గుర్తుకు వచ్చిందా? అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు.

Published : 05 Feb 2023 03:35 IST

అబిడ్స్‌, న్యూస్‌టుడే: అస్సాంలో ఆరేళ్ల నుంచి అధికారంలో కొనసాగుతున్న భాజపా సర్కారుకు బాల్యవివాహాల అంశం ప్రస్తుతం గుర్తుకు వచ్చిందా? అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. వివాహాలు జరిగిన తర్వాత ఇప్పుడు 4 వేల మందిపై కేసులు పెట్టి జైలుకు తరలించడం వల్ల ఆయా కుటుంబాల బాధ్యత ఎవరు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. దారుస్సలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అస్సాంలో అక్కడి ప్రభుత్వం మదర్సాలనూ కూల్చివేస్తోందని ఒవైసీ మండిపడ్డారు. తెలంగాణ నూతన సెక్రటేరియట్‌కు అంబేడ్కర్‌ పేరు తానే సూచించానన్నారు. ఈ నెల 18 నుంచి రెండు రోజుల పాటు రాజస్థాన్‌లో పర్యటించి, ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పాల్గొంటానని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని