logo

ఉపాధికి వేదికగా ఔషధ నగరి: మంత్రి

 సంపద పెంచడం.. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల రూపంలో దానిని ప్రజలకు అందించడమే కేసీఆర్‌ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు.

Published : 05 Feb 2023 03:47 IST

నిర్వాసిత రైతుకు ఇంటి స్థలం పత్రాన్ని అందజేస్తున్న సబితారెడ్డి, అనితారెడ్డి, సూరజ్‌కుమార్‌, జ్యోతి, జంగారెడ్డి

కందుకూరు:  సంపద పెంచడం.. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల రూపంలో దానిని ప్రజలకు అందించడమే కేసీఆర్‌ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఔషధ నగరి, విశ్వవిద్యాలయాలు, వైద్యకళాశాల, అమెజాన్‌ డేటా సెంటర్‌ వంటి వాటి ఏర్పాటుతో ఈ ప్రాంతం రూ.లక్షల కోట్ల పెట్టుబడులకు, వేలాది మంది ఉపాధికి వేదికగా మారబోతోందన్నారు. ఔషధ నగరి కోసం భూసేకరణ చేసిన అన్నోజిగూడ, ఆకులమైలారం, మీర్‌ఖాన్‌పేట, బేగరికంచలకు చెందిన 342 రైతు కుటుంబాలకు ఇళ్ల స్థలాల పత్రాల పంపిణీ శనివారం లేఅవుట్‌ వేదికగా జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ జంగారెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్‌, సర్పంచులు ఇందిర, కలమ్మతో కలిసి మంత్రి అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ఏ రైతుకు అన్యాయం జరగకుండా భూములు కోల్పోయిన అర్హులైన రైతులందరికీ ప్లాట్లు అందిస్తామన్నారు. 600 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ తరహాలో విశాలమైన రోడ్లు, అన్ని హంగులతో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్‌లో ఉగాది నాటికి ప్లాట్లు కేటాయిస్తామన్నారు. ప్రతి రైతు కుటుంబానికి ఉద్యోగం కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జడ్పీఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి మాట్లాడుతూ.. ఔషధనగరి అంటే కాలుష్యం కాదని అభివృద్ధికి చిరునామా  అన్నారు.  కార్యక్రమంలో సర్పంచులు సరళమ్మ, జ్యోతి, ఎంపీటీసీ రాములు, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సురేందర్‌రెడ్డి,  మహేశ్వరం ఏసీపీ అంజయ్య, తహసీల్దారు మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు