logo

జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్ల స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్‌

జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను కారులో తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Published : 05 Feb 2023 03:47 IST

చాంద్రాయణగుట్ట, కేశవగిరి, న్యూస్‌టుడే: జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను కారులో తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌వర్మ వివరాల ప్రకారం.. బాలాపూర్‌కు చెందిన వెంకటరెడ్డి(52), రాచకొండ ప్రాంతానికి చెందిన రమేశ్‌(45), బార్కాస్‌ సలాల నివాసి అజీజ్‌ మారుస్‌(54), నాగోల్‌కు చెందిన పి.రాంరెడ్డి, జంగయ్య, గోపాల్‌లు శుక్రవారం రాత్రి బార్కాస్‌ ప్రాంతంలో.. ఒక కారులో నుంచి మరో కారులోకి జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు మారుస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వెంకటరెడ్డి, రమేశ్‌, అజీజ్‌ మారుస్‌లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 600 జిలెటిన్‌ స్టిక్స్‌, 600 డిటోనేటర్లు సహా కారును స్వాధీనం చేసుకున్నారు. రాంరెడ్డి, జంగయ్య, గోపాల్‌లు మాత్రం కారులో పరారయ్యారు. అయితే, జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు కలిగి ఉండడానికి వెంకటరెడ్డి వద్ద లైసెన్స్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను నిందితులు ఎందుకోసం తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని