logo

కరెంటు కట్‌.. రూ.కోటిన్నర నష్టం

ఐటీ కారిడార్‌లో నిరంతరాయ కరెంట్‌ సరఫరాకు గుండె కాయలాంటిది రాయదుర్గంలోని 400 కేవీ ట్రాన్స్‌కో విద్యుత్తు ఉపకేంద్రం.

Updated : 05 Feb 2023 05:02 IST

ఐటీ కారిడార్‌లో 220 కేవీ భూగర్భ కేబుళ్లు ధ్వంసం

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ కారిడార్‌లో నిరంతరాయ కరెంట్‌ సరఫరాకు గుండె కాయలాంటిది రాయదుర్గంలోని 400 కేవీ ట్రాన్స్‌కో విద్యుత్తు ఉపకేంద్రం. దీంతో మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, మియాపూర్‌, గచ్చిబౌలి, శివరాంపల్లి, ఎర్రగడ్డ, షాపూర్‌నగర్‌తోపాటు అసెంబ్లీ, ఇతర చాలా ప్రాంతాలకు ఇక్కడి నుంచే కరెంట్‌ సరఫరా అవుతోంది. ఈనెల 2న రాయదుర్గం ఐకియా వద్ద రహదారి విస్తరణ పనులను చేపట్టిన జీహెచ్‌ఎంసీ గుత్తేదారు నిర్లక్ష్యంతో భూగర్భంలోని 220 కేవీ విద్యుత్తు కేబుళ్లు దెబ్బతిని సరఫరాలో సమస్యలు తలెత్తి రూ.కోటిన్నర నష్టం వాటిల్లింది. కేబుళ్లు దెబ్బతినగానే రిలే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. లేదంటే జేసీబీతోపాటు తవ్వకాలు చేపట్టిన వ్యక్తుల ప్రాణాలు కూడా పోయేవి. నగరం నడిబొడ్డున ప్రత్యామ్నాయం లేదని, అసెంబ్లీ సమావేశాల సమయంలో బ్రేక్‌డౌన్‌ అయితే పరిస్థితి ఏంటని ట్రాన్స్‌కో అంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని