logo

కులాంతర వివాహాలకు ఆర్థిక తోడ్పాటు

ప్రభుత్వం కుల రహిత సమాజం దిశగా అడుగులు వేస్తోంది. దీన్లో భాగంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఇతర కులాల వారు వివాహం చేసుకుంటే అందించే నజరానాను రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచింది.

Published : 06 Feb 2023 00:52 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌, బొంరాస్‌పేట: ప్రభుత్వం కుల రహిత సమాజం దిశగా అడుగులు వేస్తోంది. దీన్లో భాగంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఇతర కులాల వారు వివాహం చేసుకుంటే అందించే నజరానాను రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచింది. ఈ మార్పు 6 నెలల క్రితమే చేసినా కొద్ది రోజులుగా దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఆయా ప్రాంత ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందిస్తారు.  


34 జంటలకు అందజేత

ఈ పథకం 1955 నుంచే అమల్లో ఉంది. 2013 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.25000 అందించాయి. తరువాత ఈ మొత్తం రూ.2.5 లక్షలకు చేరింది. గత ఏడాది జిల్లాలో 86 మంది కులాంతర వివాహ సాయానికి దరఖాస్తు చేసుకోగా, 34 జంటలకు రూ.2.5 లక్షల చొప్పున రూ.85 లక్షలు అందించారు.
* వధూవరుల్లో ఎవరైనా రూ.2 లక్షల సంవత్సర ఆదాయం కలిగి ఉంటే నజరానా పొందడానికి అర్హులు.


దరఖాస్తు చేసుకోండిలా..

కులాంతర వివాహం చేసుకున్న జంటల ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. వయసు నిర్ధారణకు పదో తరగతి మార్కుల పట్టిక, వివాహ ధ్రువీకరణ పత్రం, పెళ్లి తాలూకూ మూడు ఫొటోలు, వధూవరులు కలిసి సంయుక్తంగా తెరిచిన బ్యాంకు ఖాతా పుస్తకం సమర్పించాలి. జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమాధికారి కార్యాలయంలో దరఖాస్తును సమర్పించాలి.


క్షేత్ర స్థాయిలో పరిశీలించి సిఫార్సు చేస్తారు

- మల్లేశం, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి

కులాంతర వివాహం చేసుకొని సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న అర్హులైన జంటలకు ప్రభుత్వం నజరానా అందిస్తూ అండగా ఉంటుంది. జంటలు దరఖాస్తు చేసుకుంటే, క్షేత్రస్థాయిలో పరిశీలించి నజరానాకు సిఫార్సు చేసి అందేలా చూస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని