logo

ఆధ్యాత్మిక కార్యాలకు సమయం కేటాయించాలి: చినజీయర్‌ స్వామి

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని కేటాయించాలని శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి సూచించారు.

Published : 06 Feb 2023 03:57 IST

వైభవంగా 108 దివ్య దేశాధీశులకు శాంతి కల్యాణం

ఉత్సవమూర్తులకు అభిషేకం చేస్తున్న వేద పండితులు

శంషాబాద్‌: ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని కేటాయించాలని శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి సూచించారు. శంషాబాద్‌ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న సమతా కుంభ్‌-2023 ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 రూపాల్లో వెలిసిన దివ్య దేశాల ఉత్సవ మూర్తులకు ప్రధాన వేదికపై శాంతి కల్యాణ మహోత్సవాలు నిర్వహించారు. చినజీయర్‌ స్వామి ప్రవచిస్తూ.. 108 దివ్యదేశాలకు సామూహికంగా శాంతి కల్యాణమహోత్సవాలు జరిగిన ఘనత సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికే దక్కిందన్నారు.  ప్రకృతిలోని ప్రాణులన్నింటిపైనా భగవంతుడి కృప ఉంటుందన్నారు.  అహోబిల జీయర్‌ స్వామి, దేవనాధ జీయర్‌ స్వామి, భక్తులు పాల్గొన్నారు.

శఠగోపంతో చిన జీయర్‌ స్వామిని దీవిస్తున్న అర్చకుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు