logo

‘ఒమేగా ఆసుపత్రిలో కృత్రిమ మేధ రేడియేషన్‌ ఎథోస్‌’

గచ్చిబౌలిలో ప్రపంచ స్థాయిలో సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఒమేగా ఆసుపత్రిని ఆ ఆసుపత్రి ఛైర్మన్‌, ఎండీ డా.మోహన వంశీ సీహెచ్‌ ఆదివారం ప్రారంభించారు.

Published : 06 Feb 2023 03:57 IST

గచ్చిబౌలిలో ఒమేగా ఆసుపత్రిని ప్రారంభించి మాట్లాడుతున్న డా.మోహన వంశీ

రాయదుర్గం, న్యూస్‌టుడే: గచ్చిబౌలిలో ప్రపంచ స్థాయిలో సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఒమేగా ఆసుపత్రిని ఆ ఆసుపత్రి ఛైర్మన్‌, ఎండీ డా.మోహన వంశీ సీహెచ్‌ ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో 500 పైగా పడకలతో ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. భారతదేశంలోనే తొలి కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే రేడియేషన్‌ ఎథోస్‌ను తీసుకొచ్చి విప్లవాత్మక కొత్త థెరపికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇది రోగి చికిత్సకు సంబంధించి ఆరంభ ప్రణాళిక నుంచి చివరి వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుందని చెప్పారు. కృత్రిమ మేధతో పనిచేసే ఎథోన్ని ఉపయోగించి పీఈటీ, ఎంఆర్‌- గైడెడ్‌ అడాప్టివ్‌ రేడియో థెరపీని ప్రారంభించామన్నారు. ఇది క్యాన్సర్‌ రేడియేషన్‌ చికిత్సలో కీలకమన్నారు. ఈ విధానంతో కొన్ని నిమిషాల్లోనే వ్యాధిని పూర్తిగా విశ్లేషించి వైద్యం అందిస్తుందన్నారు. భారత్‌లో డిజిటల్‌ పీఈటీ ఎంఆర్‌, డిజిటల్‌ పీఈటీ సిటీ పరికరాలతో కూడిన అత్యత్తమ న్యూక్లియర్‌ వైద్య విభాగం ప్రారంభించిన తొలి ఆసుపత్రి తమదని పేర్కొన్నారు. మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూ, ఉన్నత వసతులతో క్యాథ్‌ల్యాబ్‌ సౌకర్యంతోపాటు అనుభవజ్ఞులైన క్రిటికల్‌ కేర్‌ బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటారని వెల్లడించారు. క్యాన్సర్‌తో బాధపడే రోగులకు గుండె, కీళ్లు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, న్యూరో, గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ సమస్యల సేవలకు వివిధ సూపర్‌ స్పెషాలిటీ సేవలను ఐదో అంతస్తులో అందుబాటులో ఉన్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని