logo

‘బీసీల అభివృద్ధిని విస్మరించిన కేంద్రం’

బీసీల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు.

Published : 06 Feb 2023 03:57 IST

మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య. నినాదాలు చేస్తున్న
బీసీ సంఘాల నేతలు

నల్లకుంట, న్యూస్‌టుడే: బీసీల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో మార్పులు చేసి బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం విద్యానగర్‌ బీసీ భవన్‌లో జరిగిన సంఘం జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. జాతీయస్థాయిలో బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంటు, పథకాలు అమలు చేయాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నేతలు నీల వెంకటేష్‌, రమాదేవి, మంజునాథ్‌, రామకృష్ణ, భూపేష్‌సాగర్‌, నాగరాజు, సి.రాజేందర్‌, అనంతయ్య, నందగోపాల్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు