logo

ఉత్సాహంగా సైక్లోథాన్‌

క్యాన్సర్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు.

Published : 06 Feb 2023 03:57 IST

జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డీసీపీ శిల్పవల్లి

రాయదుర్గం, న్యూస్‌టుడే: క్యాన్సర్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు. గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రి ఆదివారం సైక్లోథాన్‌ నిర్వహించింది. ఆసుపత్రి ఆవరణలో డీసీపీ శిల్పవల్లి, ఆసుపత్రి హెమటాలజీ హెచ్‌ఓడీ డా.ఏఎంవీఆర్‌ నరేంద్ర జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ హెచ్‌సీయూ వరకు వెళ్లి వచ్చింది. ఔత్సాహిక సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీసీపీ సైకిల్‌ తొక్కి స్ఫూర్తి నింపారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో ఇలాంటివి ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఆసుపత్రి ప్రతినిధి రాజీవ్‌ చౌరే, కేర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ హెచ్‌వోడీ డా.సుధా సిన్హా, సీనియర్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డా.సతీష్‌ పవార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని