logo

నాందేడ్‌లో కేసీఆర్‌ను కలిసిన విద్యుత్తు ఉద్యోగులు

కేసీఆర్‌ను ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు నాందేడ్‌లో కలిశారు. ఆదివారం భారాస సభలో పాల్గొనేందుకు వెళ్లినవారు, అక్కడి ఇంజినీర్లతో కలిసి దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు బిల్లును వ్యతిరేకించిన తీరుకు కృతజ్ఞతలు తెలిపారు.

Published : 06 Feb 2023 03:57 IST

వినతిపత్రం ఇస్తున్న ఆలిండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: కేసీఆర్‌ను ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు నాందేడ్‌లో కలిశారు. ఆదివారం భారాస సభలో పాల్గొనేందుకు వెళ్లినవారు, అక్కడి ఇంజినీర్లతో కలిసి దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు బిల్లును వ్యతిరేకించిన తీరుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని వినతిపత్రం ఇచ్చినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి పి.రత్నాకర్‌రావు ప్రకటనలో తెలిపారు. సీఎంను కలిసిన వారిలో సంఘం సెక్రెటరీ జనరల్స్‌ శివశంకర్‌, పి.సదానందం, వెంకటనారాయణరెడ్డి, జనప్రియ, పీవీరావు, గోపాలకృష్ణ తదితరులున్నారు. తెలంగాణ విద్యుత్తు అకౌంట్స్‌ అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శి అంజయ్య బృందమూ ఉన్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని