logo

మహిళా వర్సిటీకి తీరనున్న వసతుల కొరత

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో మహిళా విశ్వవిద్యాలయానికి మాత్రమే కేటాయింపులు లభించాయి. నగరంలోని మిగిలిన విశ్వవిద్యాలయాలకు వేతన గ్రాంట్లు మాత్రమే దక్కాయి.

Published : 07 Feb 2023 04:06 IST

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో మహిళా విశ్వవిద్యాలయానికి మాత్రమే కేటాయింపులు లభించాయి. నగరంలోని మిగిలిన విశ్వవిద్యాలయాలకు వేతన గ్రాంట్లు మాత్రమే దక్కాయి. కోఠిలోని మహిళా వర్సిటీకి ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. కళాశాలలో తరగతి గదుల భవనాలు, విద్యార్థినులకు జీప్లస్‌ తొమ్మిది అంతస్తుల వసతిగృహ సముదాయం నిర్మాణం కోసం వీటిని ఖర్చు చేయనున్నారు. నిధుల కేటాయింపుపై  వర్సిటీ ప్రిన్సిపల్‌ ఆచార్య విజ్జులత, అధ్యాపకులు, విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.

అభివృద్ధి నిధుల్లో వస్తాయా!... రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.500కోట్లు ఇస్తున్నామంటూ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ నిధుల్లో కొన్నైనా నగరంలోని వర్సిటీలకు ఆర్థికశాఖ కేటాయిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉస్మానియా, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. బాచుపల్లిలోని తెలుగు వర్సిటీలో పూర్తికావాల్సిన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. మరోవైపు     తుక్కుగూడలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ను ఈ ఏడాదే   ప్రారంభిస్తామని బడ్జెట్‌లో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని