logo

నేను అందుబాటులో ఉంటా.. మీరూ ఉండండి: కలెక్టర్‌

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వంద శాతం అందుబాటులో ఉంటానని.. మీరూ ఉంటూ  సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు.

Published : 07 Feb 2023 04:06 IST

ప్రజావాణిలో అర్జీలను స్వీకరిస్తున్న నారాయణరెడ్డి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, వికారాబాద్‌ గ్రామీణ: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వంద శాతం అందుబాటులో ఉంటానని.. మీరూ ఉంటూ  సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించటానికి ముందుగా అధికారులతో మాట్లాడారు. అర్జీలను నిశితంగా పరిశీలించి వారం రోజుల్లో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులందరూ టీం వర్క్‌గా పనిచేసి రాష్ట్రంలో జిల్లాను 5 స్థానంలో నిలపాలన్నారు.

* కలెక్టర్‌ కార్యాలయంలో రెండు, మూడు రోజుల్లో బయోమెట్రిక్‌, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.  

* ధరణి సమస్యల పరిష్కారానికి నేటి (మంగళవారం) నుంచి తహాసీల్దారు కార్యాలయాల్లో ధరణి హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ తెలిపారు. సోమవారం దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ధరణి ఫిర్యాదులపై జిల్లా అదనపు పాలానాధికారి రాహుల్‌శర్మ, డీఆర్‌ఓ అశోక్‌కుమార్‌లతో కలిసి మండలాల వారిగా తహసీల్దార్లు, సిబ్బందితో మాట్లాడారు. ఈనెల 8 నుంచి మీ సేవా కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించాలన్నారు.  

అన్నం పెట్టే రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం పెద్ద పాపమని కలెక్టర్‌ అన్నారు.  

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మంచి సేవలు అందించాలనే లక్ష్యంతో జీఈఓ అటెండెన్స్‌ యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.  

*  కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆయన అనంత పద్మనాభ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని