మాతోనే సామాజిక న్యాయం: తెదేపా
తెలుగుదేశం పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు.
కార్యకర్తలతో బక్కని నర్సింహులు
దౌల్తాబాద్, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు. సోమవారం ఆయన దౌల్తాబాద్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేేశంలో కొడంగల్ నియోజకవర్గ బాధ్యుడు బాలకిశోర్ యాదవ్‌తో కలిసి మాట్లాడారు. త్వరలోనే రాష్ట్రంలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో తెదేపా అభిమానులు, నాయకులు, కార్యకర్తలను కలిసి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ మండల నాయకులు వల్గిరి నారాయణ, బిచ్చిరెడ్డి, చారి, మొగులప్ప, మాణిక్యప్ప, నరేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Taapsee: లక్ష్మీదేవి నెక్లెస్ వివాదం.. తాప్సీపై కేసు నమోదు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా!.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
-
Ap-top-news News
Vijayawada: నాడు అన్న క్యాంటీన్.. నేడు వ్యర్థాల కేంద్రం
-
Ts-top-news News
MLC Kavitha: కవిత సెల్ ఫోన్లలోని డేటా సేకరణ
-
Ts-top-news News
Indian Railway: రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక