ముగిసిన హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్
నాలుగు రోజుల పాటు సాగిన 12వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. మిక్స్‌డ్ డబుల్ విభాగం ఫైనల్లో గాయత్రి, చంద్రశేఖర్ జోడి, హరికృష్ణ, శశికళ జోడిపై 8-4తో విజయాన్ని సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
విజేతలతో అతిథులు
నారాయణగూడ, న్యూస్‌టుడే: నాలుగు రోజుల పాటు సాగిన 12వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. మిక్స్‌డ్ డబుల్ విభాగం ఫైనల్లో గాయత్రి, చంద్రశేఖర్ జోడి, హరికృష్ణ, శశికళ జోడిపై 8-4తో విజయాన్ని సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. మెన్స్ 50 ప్లస్ డబుల్స్ విభాగంలో హరికృష్ణరెడ్డి, రియాజ్ జోడి, నంద్యాల నరసింహారెడ్డి, నీల్‌కాంత్‌లపై 10-5తో విజయం సాధించారు. మెన్స్ 40 ప్లస్ డబుల్స్ విభాగంలో ప్రదీప్‌కుమార్, శ్రీరామ్‌లు 10-7తో శ్రీనివాస్‌గౌడ్, శ్రీకర్‌లపై అలవోకగా విజయంతో ట్రోఫీ గెలుచుకున్నారు. మెన్స్ 60 ప్లస్ డబుల్స్‌లో మెహర్ ప్రకాశ్, వి.శంకర్‌లు 10-9 (7-5) టైబ్రేకర్‌లో మనోహర్, రవిశంకర్‌లపై పైచేయి సాధించి టైటిల్ కొట్టారు. నందాల నర్సింహారెడ్డి జోడి రన్నరప్‌గా నిలిచారు. మెన్స్ 60 ప్లస్ సింగిల్స్‌లో మెహర్ ప్రకాశ్, మెన్స్ 70 ప్లస్ సింగిల్స్‌లో రామమోహన్‌రావు, 50 ప్లస్ సింగిల్స్‌లో నీల్‌కాంత్‌లు విజేతలుగా నిలిచారు. మహిళా విభాగంలో టైటిల్ పోరులో (30 ప్లస్ డబుల్స్) నీలం అగర్వాల్, నయనతార జోడి 8-4తో సౌమ్యనాయుడు, అరుణ భాస్కర్‌లపై గెలుపొందారు. 40 ప్లస్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌లో వెటరన్స్ టెన్నిస్‌లో ఇద్దరు డెంటిస్ట్‌లు డాక్టర్ ప్రదీప్ వల్లూరుపల్లి, డాక్టర్ చిరుమామిళ్ల శ్రీరామ్, ఎల్.శ్రీనివాస్, శ్రీకర్‌లు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. విజేతలుగా నిలిచిన వారికి ఖమ్మం జిల్లా, సెషన్స్ జడ్జీ అపర్ణ, హైదరాబాద్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డిలు బహుమతులు ప్రదానం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్‌గా బెడ్‌షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు