logo

పారిశ్రామిక విప్లవానికి కేంద్ర బడ్జెట్‌ ఊతం

కేంద్ర బడ్జెట్‌ పారిశ్రామిక విప్లవానికి ఊతమిస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 04:06 IST

మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ రాములు. చిత్రంలో ప్రొఫెసర్‌ డీవీజీ కృష్ణ తదితరులు

గోల్నాక, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌ పారిశ్రామిక విప్లవానికి ఊతమిస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. సోమవారం చాదర్‌ఘాట్‌ మార్వాడీ శిక్షా సమితి ఆర్‌జీ కేడియా కళాశాలలో డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డీవీజీ కృష్ణ అధ్యక్షతన కేంద్ర బడ్జెట్‌పై సదస్సు నిర్వహించారు. ఆలిండియా టాక్స్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్‌బీ కాబ్రా, ఆర్‌బీఐ విశ్రాంత ఛైర్‌ ప్రొఫెసర్‌ ఇంద్రకాంత్‌, ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌, ఆర్థికశాస్త్ర ఫొఫెసర్‌ డాక్టర్‌ రాములు, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సలహాదారు ప్రొఫెసర్‌ ఆర్యశ్రీ, మాజీ సమాచార కమిషనర్‌ దిలీప్‌రెడ్డి మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని