logo

మౌలాలి ఉర్సు ప్రారంభం

మౌలాలి దర్గా ఉర్సు సోమవారం ప్రారంభమైంది. పాతబస్తీలోని పలు ప్రాంతాల నుంచి సెహరా (పూలహారం)తో భక్తులు దర్గాకు చేరుకున్నారు.

Published : 07 Feb 2023 04:06 IST

సెహరాను తీసుకొస్తున్న పాతబస్తీవాసులు

మౌలాలి, న్యూస్‌టుడే: మౌలాలి దర్గా ఉర్సు సోమవారం ప్రారంభమైంది. పాతబస్తీలోని పలు ప్రాంతాల నుంచి సెహరా (పూలహారం)తో భక్తులు దర్గాకు చేరుకున్నారు. వారికి మౌలాలి కమాన్‌ వద్ద కార్పొరేటర్‌ గున్నాల సునీతాయాదవ్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు  స్వాగతం పలికారు. చందాబాద్‌ నుంచి ఎంజే కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి నుంచి ఈస్ట్‌ ప్రగతి నగర్‌ మీదుగా నిర్మించిన ర్యాంపు ద్వారా భక్తులు దర్గాపైకి చేరుకున్నారు. కాంగ్రెస్‌ డివిజన్‌ అధ్యక్షుడు వంశీ ముదిరాజ్‌, భారాస మాజీ అధ్యక్షుడు భాగ్యనందరావు, మైనార్టీ నాయకులు ఇబ్రహీం స్వాగతం పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని