ఖాతాదారులకు ఉత్తమ సేవలందించాలి: ఎస్‌బీఐ ఛైర్మన్
ఖాతాదారులకు మరింత ఉత్తమ సేవలందించి మన్ననలు అందుకోవాలని స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ దినేష్ ఖార పేర్కొన్నారు.
ఏపీ కనెక్ట్ ఆంధ్రా సంస్థ ప్రతినిధులకు రూ.32.79 లక్షల చెక్కు అందజేస్తున్న ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖార
రాయదుర్గం, న్యూస్‌టుడే: ఖాతాదారులకు మరింత ఉత్తమ సేవలందించి మన్ననలు అందుకోవాలని స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ దినేష్ ఖార పేర్కొన్నారు. గచ్చిబౌలిలో సైబరాబాద్ ఎస్‌బీఐ పరిపాలనా కార్యాలయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద మూసాపేట సాయిసేవా సంఘ్‌కు 36 సీట్ల పాఠశాల బస్సు, రోహిణీ ఫౌండేషన్‌కు సంచార దంత రక్షణ (మొబైల్ డెంటల్ కేర్) వ్యాన్‌ను అందజేశారు. ఆ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కోఠిలోని ఏపీ అమరావతి ఎల్‌హెచ్‌వో (లోకల్ హెడ్ ఆఫీస్)ని ఆయన సందర్శించారు. అనంతరం ఆ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థ కనెక్ట్ ఆంధ్రాకు రూ.32.79 లక్షల చెక్కును సీఎస్‌ఆర్ కింద.. సంస్థ ప్రతినిధులు బి.ప్రశాంత్ రెడ్డి, నాగరాజులకు అందజేశారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ అభియాన్‌లో భాగంగా ఆ సంస్థ టీబీ రోగులకు సేవలందిస్తుందని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. బ్యాంకు ఎండీ (రిస్క్, కంప్లయన్స్ విభాగం) అశ్విని తివారి, డీఎండీ ఓంప్రకాష్ మిశ్ర, నగర విభాగం సీజీఎం అమిత్ ఝింగ్రన్, అమరావతి సర్కిల్ సీజీఎం నవీన్ కుమార్, సీజీఎం నవీన్ చంద్ర ఝా, జీఎంలు మంజు శర్మ, దేబాశిష్ మిత్ర, కె.గుండురావు, కృష్ణ శర్మ, ఎం నారాయణ్ శర్మ, డీజీఎం జితేంద్ర పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Ts-top-news News
నేటి నుంచి బీఎస్-6.2 నిబంధన అమలు
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కొత్త టోల్ఛార్జీలు
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!