logo

నాసిరకం బూట్లు విక్రయించారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు

బూట్లు కొనుగోలు చేసి మూడు నెలలైనా కాలేదు.. అప్పుడే చిరిగిపోయాయి.. నాసిరకం అంటగట్టడంతోపాటు వారంటీ నిబంధనలకు విరుద్ధంగా డబ్బు తిరిగి ఇవ్వకుండా, కొత్త బూట్లు ఇవ్వకుండా సేవల్లో లోపం కలిగించారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-1ను ఆశ్రయించారు.

Published : 07 Feb 2023 04:06 IST

రూ.30 వేలు వడ్డీతో చెల్లించాలని కమిషన్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: బూట్లు కొనుగోలు చేసి మూడు నెలలైనా కాలేదు.. అప్పుడే చిరిగిపోయాయి.. నాసిరకం అంటగట్టడంతోపాటు వారంటీ నిబంధనలకు విరుద్ధంగా డబ్బు తిరిగి ఇవ్వకుండా, కొత్త బూట్లు ఇవ్వకుండా సేవల్లో లోపం కలిగించారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-1ను ఆశ్రయించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం బూట్లకు అయిన డబ్బు రూ.14,999, 6 శాతం వడ్డీతో రీఫండ్‌ చేయడంతోపాటు, రూ.10 వేలు పరిహారం, రూ.5 వేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆంపిల్‌ రిటైల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను ఆదేశించింది. జీవీకే మాల్‌లోని స్టోర్‌లో 2022 ఏప్రిల్‌లో సీఎస్‌ రూ.14,999 వెచ్చించి వాకింగ్‌షూస్‌ కొనుగోలు చేశారు. అన్ని సీజన్లలో సౌకర్యవంతంగా, ఎంతోకాలం మన్నికగా ఉంటాయని చెప్పినా 3 నెలలలోపే పాడయ్యాయి. సంస్థ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక ఆగస్టులో కమిషన్‌ను ఆశ్రయించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన కమిషన్‌ అధ్యక్షురాలు బి.ఉమా వెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, ఆర్‌.నారాయణరెడ్డితో కూడిన బెంచ్‌ తీర్పు వెలువరించి 45 రోజుల్లో అమలు చేయకుంటే 3 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని