logo

పేరున్న పట్టణాలు.. నిత్యం పాట్లు

జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాలున్నాయి. వీటిలో సమస్యలు పెరిగిపోతున్నా పట్టించుకునే ప్రజా ప్రతినిధులు, అధికారులు కరవవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

Published : 08 Feb 2023 02:47 IST

తాండూరులోని చెత్త డంపింగ్‌ యార్డు ఇలా..

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి, తాండూర్‌టౌన్‌, కొడంగల్‌: జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాలున్నాయి. వీటిలో సమస్యలు పెరిగిపోతున్నా పట్టించుకునే ప్రజా ప్రతినిధులు, అధికారులు కరవవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తాండూర్‌, వికారాబాద్‌ పురపాలక సంఘాలుగా ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. పరిగి, కొడంగల్‌ నాలుగు సంవత్సరాల క్రితం పురపాలికలుగా మారాయి. వీటిలో పట్టణాల్లో సరియైన పారిశుద్ధ్య పనులు చేపట్టక దోమలు విజృంభిస్తున్నాయి. వీటికి తోడు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవీ చిచ్చు ఆరు నెలలుగా వికారాబాద్‌, తాండూర్‌లో పురపాలికల్లో కొనసాగుతోంది. 

రోడ్ల మరమ్మతులు కరవు

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లు మాత్రమే కాకుండా అంతర్గత రోడ్లు దారుణంగా మారాయి. వికారాబాద్‌ కొత్తగడి వరకు ఉన్న తారు రోడ్డు మధ్యమధ్యలో దెబ్బతింది. వికారాబాద్‌ వెంకటాపూర్‌ తండాకు వరకు ఉన్న రోడ్డు అక్కడక్కడ దెబ్బతింది. ఇది జరిగి రెండు సంవత్సరాల అయినా అధికారులు పట్టించుకోవటం లేదు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి దెబ్బతిన్నా మరమ్మతులు మాత్రం చేపట్టడం లేదు. దీనికి రూ.12 కోట్లు కేటాయించినా కార్యాచరణ కొరవడింది.

* తాండూర్‌, పరిగి, కొడంగల్‌ పట్టణాల్లో ప్రధాన, అంతర్గత రోడ్లు గుంతలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. 

వికారాబాద్‌లో దెబ్బతిన్న రైల్వే పైవంతె

నీటి సరఫరా అస్తవ్యస్తం

* పరిగి పురపాలక సంఘం పరిధిలో నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. బస్టాండ్‌ వద్ద ఉన్న నీటిని సరఫరా చేసే మోటారు కాలిపోయి 20 రోజులు అవుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. 

భరించలేని దుర్గంధం

* తాండూరు పట్టణంలో ప్రతి రోజూ వెలువడుతున్న 42 మెట్రిక్‌ టన్నుల చెత్తను వాహనాల్లో శివారులోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేయాల్సి ఉన్నా ప్రక్రియ కానరావటం లేదు. వికారాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.

* కొడంగల్‌ పురపాలికలో చెత్తను రోడ్లపైనే వేస్తున్నారు. ఇక్కడ చెత్త కుండీలు లేవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు