రైలు వచ్చే వేళ.. బస్సులేక వెత!
నవాబుపేట పరిధిలోని చిట్టిగడ్డ, గొల్లగూడ రైల్వే స్టేషన్ల నుంచి నిత్యం వందల మంది జంట నగరాలకు రాకపోకలు సాగిస్తుంటారు.
స్టేషన్‌లో ప్రయాణికులు
న్యూస్‌టుడే, నవాబ్‌పేట: నవాబుపేట పరిధిలోని చిట్టిగడ్డ, గొల్లగూడ రైల్వే స్టేషన్ల నుంచి నిత్యం వందల మంది జంట నగరాలకు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు, ఉద్యోగులు, వృత్తి నైపుణ్య, దినసరి కూలీలు, విద్యార్థులు, రైతులు తదితరులు ఉంటారు. వీరికి తమ గ్రామం నుంచి స్టేషన్లకు చేరుకోవడానికి వికారాబాద్ మీదుగా రోడ్డు సౌకర్యం ఉన్నా సమయానుకూల బస్సులు లేకపోవడంతో తిప్పలు తప్పడంలేదు. ఇలా ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నామని, కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం బస్సులు నడపాలని కోరుతున్నారు.
వందల మంది రాకపోకలు
మండంలోని చిట్టిగడ్డ రైల్వేస్టేషన్ నుంచి చిట్టిగడ్డతో పాటు చిట్టిగిద్ద, అక్నాపూర్, అత్తాపూర్, చించల్‌పేట, పులుసుమామిడి, పాతూరు, కామారెడ్డిగూడ, పెళ్లిమడుగు (వికారాబాద్ మండలం) నవాబుపేట, పులుమామిడి, ఆర్కతల, యావపూర్ తదితర గ్రామాల నుంచి సుమారు 200 మంది వరకు ప్రయాణికులు తిరుగుతున్నారు.
* గొల్లగూడ రైల్వేస్టేషన్‌కు గొల్లగూడతో పాటు, గంగ్యాడ, నారెగూడ, గుబ్బడిఫతేపూర్, పూలపల్లి, ఎల్లకొండ, లింగంపల్లి, అంతప్పగూడ (చేవెళ్లమండలం) తదితర గ్రామాల నుంచి ప్యాసింజర్ రైళ్ల ద్వారా నిత్యం సుమారు 150 మంది వరకు ప్రయాణికులు వచ్చి పోతున్నారు.
ఉదయం.. సాయంత్రం..: ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్లలో ఫలక్‌నుమా నుంచి వాడి, చిత్తాపూర్ నుంచి హైదరాబాద్, వికారాబాద్ నుంచి కాచిగూడ ఇలా మూడు రైళ్లు ఉదయం సాయంత్ర వేళ్లలో తిరుగుతున్నాయి. రైలు వచ్చే సమయంలో రెండు రైల్వే స్టేషన్లను అనుసంధానం చేస్తూ ఉదయం - సాయంత్రం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే ఎంతో వీలుగా ఉంటుందని ప్రయాణికులు కోరుతున్నారు.
సిబ్బందితో సర్వే నిర్వహిస్తాం...
- భక్ష నాయక్, డీఎం, వికారాబాద్ డిపో
చిట్టిగిద్ద, గొల్లగూడ రైల్వేస్టేషన్ల రైళ్ల రాకపోకల సమయాలు, ఎక్కడెక్కడి నుంచి ఎంత మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారనే విషయమై మా సిబ్బందితో సర్వే నిర్వహిస్తాం. అవసరాన్నిబట్టి బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకుంటాం.
మా ఇక్కట్లు గమనించాలి
- శేఖర్‌రెడ్డి, ఆర్కతల, ప్రైవేటు ఉద్యోగి
మా గ్రామం ఆర్కతల నుంచి చిట్టిగిద్ద రైల్వేస్టేషన్‌కు రానుపోను 15 కిమీల దూరం ఉంటుంది. నిత్యం ఉదయం, సాయంత్రం ద్విచక్ర వాహనం ద్వారా స్టేషన్‌కు చేరుకోవాలి. బస్సు ఉంటే ఈ అవస్థ ఉండదు. ఇలా వందలాది ఉన్నారు. మా కష్టాలను గమనించి బస్సులను నడపాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: ఎమ్మెల్యే శ్రీదేవి ఫ్లెక్సీలను చించేసిన వైకాపా నాయకులు
-
Ts-top-news News
ఖగోళంలో వింత... చంద్రుడితో శుక్ర గ్రహణం
-
India News
Rahul Gandhi : రాహుల్‌పై వేటు నిలబడుతుందా..
-
Ap-top-news News
Vande Bharat Express : తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Crime News
చిలుక వాంగ్మూలంతో.. హత్యకేసు నిందితులకు జీవితఖైదు
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్‌సభ సచివాలయం